అక్షర న్యూస్ :ఈనెల 21 బుధవారం రోజున భక్త మార్కండేయ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించే తలపెట్టామని పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు బైరి మురళి పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పద్మశాలి సమాజం నాయకులు మాట్లాడారు. సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం, మహిళా విభాగం, యువజన సంఘo వారి ఆధ్వర్యంలో జరిగే శోభాయాత్రలో పద్మశాలి కుల బాంధవులు యువతీ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి యువజన సమాజం ఉపాధ్యక్షులు మెరుగు అజయ్, ఉపాధ్యక్షులు బింగి సాయికుమార్ సహాయ కార్యదర్శి పుట్ట రాకేష్ కార్యవర్గ సభ్యులు ఎరుకుల స్వామి,రాము పాల్గొన్నారు..

