అక్షర న్యూస్ :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026
సందర్భంగా సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు, వన్ టౌన్, టూ టౌన్ మరియు ట్రాఫిక్ పోలీసులు సమిష్టిగా సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ మరియు ముస్తాబాద్ రహదారిలో గల బ్లాక్ స్పాట్స్ గుర్తించి వాటి వద్ద జరిగినరోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులతో ప్రమాదం నింపిన విషాదం గూర్చి ఇతర వాహనదారులతో మాట్లాడించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ గారు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 97 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉందని ఈ రహదారిపై అనేక చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని , రహదారి భద్రతా నియమాలు పాటించని వాహనదారులు ముఖ్యంగా ఈ బ్లాక్ స్పాట్ వద్ద రహదారి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ విధిగా రహదారి భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని సూచించారు.
సిద్దిపేట వన్టౌన్ సీఐ శ్రీ వాసుదేవ రావు గారు మరియు ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనం నడిపితే ప్రమాద బాధితులు అవడంతోపాటు, తనిఖీలో దొరికితే బండి సీజ్ చేయడం లైసెన్స్ రద్దు చేయడం తో పాటు చలానా కూడా విధించడం జరుగుతుందని సూచించారు.
సిద్దిపేట అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ రహదారి నియమ నిబంధనలతో పాటించేవారిని గమ్యం చేరుస్తుందని అవి తప్పిన వారికి ప్రమాదం రూపంలో ప్రాణాలహరిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు ఒక విధిగా పాటించాలని తద్వారా తమ కుటుంబానికి ఇతరుల కుటుంబానికి మెలు చేసిన వారవుతారని సూచించారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ గారు అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు వన్టౌన్ సీఐ వాస్ దేవరావు గారు, సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ , టు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు మరియు రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు..



