అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి శ్రీ రేణుకా మాత అమ్మవారిని దర్శించుకున్న రాములు మహారాజ్.. గత 75 సంవత్సరాలుగా చరిత్ర ఉన్న అమ్మవారు కొంగు బంగారమై ఈ ప్రాంత ప్రజలకు దర్శనమిస్తున్నారని, మహిమలు కలిగిన అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను అని రాములు మహారాజ్ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ రేణుక మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్, క్యాషియర్ కొండ్ర యాదగిరి.. స్వామివారి వెంట బిక్షపతి, శ్రీనివాస్ గౌడ్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

