• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్: హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..

Bypentam swamy

Jan 19, 2026

అక్షర న్యూస్:హుస్నాబాద్ నియోజకవర్గంను అన్ని రంగాల్లో ముందుంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ విడత అర్హులైన లబ్ధిదారులకు 372 మంది ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందజేశారు. 3520 మందికి మహిళా సంఘాల నుండి కోటి 13 లక్షల రూపాయలు వడ్డీలేని రుణాలు చెక్కును అందజేశారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కరీంనగర్ , సిద్దిపేట, హనుమకొండ, జనగాం జిల్లాలకు మధ్యలో ఉన్న హుస్నాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడత లో మంజూరైన 171 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు పూర్తవుతున్నాయని తెలిపారు. ఇల్లు రాని వారు అప్లికేషన్ పెట్టుకోవాలనీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి నియోజవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందని తెలిపారు.ఇల్లు మంజూరు అయిన వారు రేపటి నుండే ఇల్లు ముహూర్తం చేసి పనులు ప్రారంభించాలని కోరారు. ఇల్లు కట్టుకునే వారికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తున్నామన్నారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో
రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని,దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి సెట్విన్ ద్వారా శిక్షణ అందిస్తున్నామని దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చడానికి గ్రామగ్రామాన స్టీల్ బ్యాంక్ పంపిణీ చేసినట్లు తెలిపారు. దానిని వినియోగించాలని ప్లాస్టిక్ వాడితే కాన్సర్ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు. హుస్నాబాద్ లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని , పీజీ కాలేజీ వస్తుందని తెలిపారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని , అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కళాశాల తెచ్చామని, కోహెడ మండలం లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.గత 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధి రెండు ఏళ్లలో చేసి చూపించామని పేర్కొన్నారు.గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి హుస్నాబాద్ సస్య శ్యామలం చేస్తామన్నారు.హుస్నాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. హుస్నాబాద్ కి రింగ్ రోడ్డు మంజూరు చేయాలని ఇటీవల హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకుపోయామని తెలిపారు.ప్రజా పాలన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

మున్సిపల్ కార్యాలయంలో 57 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మైనార్టీ మహిళలు చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి 50 వేల రూపాయల వరకు బ్యాంకు లోన్ అందిస్తుందని తెలిపారు. ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కుట్టు మిషన్ లు పంపిణీ చేసేలా కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు. హుస్నాబాద్ లో నల్ల పన్ను,ఇంటి పన్ను ఇబ్బందులు లేకుండా సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గతంలో హుస్నాబాద్ ను బలవతంగా సిద్దిపేట జిల్లాలో చేర్చారని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని తెలిపారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్ కేటాయిస్తామని వారికి స్థానిక సర్వే తో పాటు రాష్ట్ర సర్వే ఆదరంగా పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వార్డుల్లో తిరగాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.హైమవతి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, డిఆర్డీవో జయదేవ్ ఆర్య, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్, ఇతర ముఖ్య నేతలు , అధికారులు పాల్గొన్నారు..

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..