అక్షర న్యూస్ :రోడ్డు సురక్ష అభియాన్ / రహదారి భద్రత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు విజయభాస్కర్, ఉమేష్, మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట గారి ఆదేశానుసారం సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిద్ధిపేట ట్రాఫిక్ పిఎస్ సిబ్బంది వినూత్న రీతిలో RK-Teddy ఈవెంట్స్ వారితో కలిసి హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకి మరియు సీట్ బెల్ట్ ధరించిన ఫోర్ వీలర్ వాహనదారులకి గులాబీ పువ్వు ను అందిస్తూ వారిని అభినందించడం జరిగింది . అలాగే వాహనదారులకు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ హెల్మెట్ ధరించవలెను సీట్ బెల్ట్ ధరించవలెను మద్యం తాగి వాహనాలు నడపడం చట్ట ప్రకారం నేరమని అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలో ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా వాహనాలు నడిపి గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు విజయ భాస్కర్, గోపాల్ రెడ్డి, ఉమేష్, మల్లేశం, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి మోహన్, కానిస్టేబుల్ శ్రీనివాస్ అఖిల్ మరియు ఆర్కే టెడ్డి ఈవెంట్స్ ఆర్గనైజర్ పరుశురాములు అతని సిబ్బంది పాల్గొనడం జరిగింది.


