• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం..

Bypentam swamy

Jan 2, 2026

అక్షర న్యూస్ : శుక్రవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….

నియోజకవర్గం లో పంచాయతీ రాజ్ శాఖల లో చేపడుతున్న ఏంజిఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్, బి టి రోడ్, హెల్త్ సబ్ సెంటర్, అంగన్వాడి టాయిలెట్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్ రిపైర్, కాంపౌండ్ వాల్ నిర్మాణం, కింద సీసీ రోడ్స్, జీపి బిల్డింగ్, అంగన్వాడి సెంటర్స్, వివిధ రహదారుల నిర్మాణంలో ఉన్నవి పూర్తి చెయ్యాలని అలాగే పనులు మొదలు కానివి ప్రారంభించాలని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కాంట్రాక్టర్ లు వేగంగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం కింద చేపట్టిన పి ఎచ్ సి ల మేజర్ మైనర్ రిపేర్లు వేగంగా పూర్తి చెయ్యాలి.

అర్ అండ్ బి శాఖ అధికారులు చేస్తున్న రోడ్ నిర్మాణాలు పూర్తి చెయ్యాలి. హుస్నాబాద్ నుండి కొత్తపల్లి నాలుగు వరసల రోడ్ నిర్మాణంలో ఎలక్ట్రిసిటీ స్తంభాలు, చెట్లు నరకడం తొలగించడం పనులు పలు శాఖల సమన్వయంతో పూర్తి చేసి రోడ్ నిర్మాణ పనులు మొదలవ్వాలి ఆదేశించారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

మున్సిపల్ లో జంక్షన్ డెవలప్మెంట్, ఎల్లమ్మచెరువు వెళ్ళేందుకు రోడ్ నిర్మాణం, అర్చులు, సుందరీకరణ పనులు ఇతరత్ర పనులు నిర్ణిత కాలం లో పూర్తి చేయాలని ఆదేశించారు.

నేషనల్ హైవే సిద్దిపేట-ఎల్కతుర్తి 85% రోడ్ పనులు పూర్తి చేశామని పందిళ్ళ టోల్ ప్లాజా నిర్మాణం, బస్వాపూర్ ఫారెస్ట్ క్లియరెన్స్ చేసుకుని రోడ్ నిర్మాణం, రోడ్ వెంబడి గల పలు విగ్రహాల తొలగింపుకు ఆయా గ్రామాల సర్పంచ్, సెక్రటరీ లను కలిసి అందరి సమక్షంలో రోడ్లపై నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

విద్యుత్ శాఖ ఆయా గ్రామంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం పూర్తి చెయ్యాలని తెలిపారు.

గౌరవేల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో చేపడుతున్న మిషన్ భగీరథ పనులు నిర్ణిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..

ఆయిల్ ఫామ్ సాగు గూర్చి మీకు ఇచ్చిన టార్గెట్ ను తప్పనిసరిగా పూర్తి చెయ్యాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు.