అక్షర న్యూస్ : రేపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు. టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సత్రం, దీక్షా విరమణ మండపాల నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. దీంతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
