అక్షర న్యూస్ : ప్రతి వాహనదారుడు తప్పకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని సిద్ధిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు రహదారి భద్రత నిబంధనల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ నిబంధనలు పాటించకపోవడంతోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు తప్పకుండా బిగించుకోవాలన్నారు. వాహనాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా సీటు బెట్టు ధరించి వాహనాలు నడుపుతున్న వారికి గులాబీ పువ్వులు ఇచ్చి అభినందనలు తెలిపారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు.
ఈ మాసోత్సవల్లో ఏఎంవిఐ శ్రీకాంత్ రెడ్డి, ఏవో నజీర్, సిబ్బంది ఉన్నారు.


