• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : కొద్దిసేపటి క్రితం గర్భిణీకి ఇంట్లోనే సుఖప్రాసవం కొండపాక “108” సిబ్బంది..

Bypentam swamy

Dec 28, 2025

అక్షర న్యూస్ : కొండపాక వడ్డెర కాలానికి చెందిన లక్ష్మి (25) w/o: ప్రభాకర్, కీ పురిటి నొప్పులు వస్తున్నాయి అని వారి బంధువులు 108 కీ సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కొండపాక “108” సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ రమేష్ హుటా హుటిన ఘటన ప్రాంతానికి వెళ్లి గర్భిణీ ని చూడగ ఆమెకు పురిటినొప్పులు అధికం కావటం గమనించి అంబులెన్సు లోకి తరలించలేని పరిస్థితి లో ఉండటం తో వెంటనే మెడికల్ టెక్నీషియన్ మహేందర్ “108” కాల్ సెంటర్ లో వున్నా డాక్టర్ శ్రీకాంత్ గారికి గర్భిణీ పరిస్థితి వివరించి అతడి సలహాలు, సూచనలు పాటిస్తూ ఇంట్లోనే సుఖ ప్రసవం చేసి తల్లి మరియు బిడ్డలను కాపాడి తదుపరి చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటం జరిగింది కొండపాక సిబ్బంది..

కాగా లక్ష్మి కీ ఇదివరకు ఇద్దరు అడబిడ్డలు కాగా ఇపుడు మూడవ కాన్పులో మరొక పాపా జన్మిచిటం జరిగింది.అప్పుడే జన్మించిన పాపతో మెడికల్ టెక్నీషియన్ మహేందర్..

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

108 కీ ఫోన్ చేయగానే సకాలంలో స్పందించి తల్లి, బిడ్డలను కాపాడిన సిబ్బంది ని పలువురు అభినందించారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..