అక్షర న్యూస్ :శ్రీ రేణుకా మాత అమ్మవారిని దర్శించుకున్న పెద్దగుండవెల్లి నూతన సర్పంచ్ పాలకవర్గం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు ఆరాధ్య దైవంగా దర్శనమిస్తున్నారని, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా దర్శనమిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని అదేవిధంగా భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ కమిటీ పని చేస్తుందని సర్పంచ్ గుండెల వజ్రవ్వ ఉపసర్పంచ్ బండారి రామచంద్రం తెలిపారు. శ్రీ రేణుకా మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాలకవర్గానికి సన్మానం చేసి అమ్మవారి చిత్రపటాన్ని బహుమానంగా నూతన పాలకవర్గానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకా మాత ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్, క్యాషియర్ కొండ్ర యాదగిరి, టిఆర్ఎస్ నాయకులు నక్కల బుచ్చిరెడ్డి, ఆశంగారి నరేష్ గౌడ్, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



