అక్షర న్యూస్ :అస్మిత ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ వెస్ట్ జోన్ మధ్యప్రదేశ్ పోటీలకు ఎంపికైన సిద్దిపేట జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ చెందిన చిన్నారులు అభినందిస్తున సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి IAS గారు..
ఇటీవలే సంగారెడ్డి బాదర్ గార్డెన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ వెస్ట్ జోన్ సెలక్షన్స్ ట్రాయిల్లో సిద్దిపేట కిక్ బాక్సింగ్ అసోసియేషన్ 6 అమ్మాయిలు ఎంపికైనటు జిల్లా ప్రధాన కార్యదర్శి రామిని భాగ్యరాజ్ ఒక్క ప్రకటనలో తెలిపారు ఎంపికైన అమ్మాయిలని సోమవారం రోజున స్థానిక జిల్లా కలెక్టర్
కార్యాలయంలో కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి IAS గారి స్వహస్తాలతో మీడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది
మధ్యప్రదేశ్ కు ఎంపికైన సిద్దిపేట జిల్లా అమ్మాయిలు R. ప్రవళిక, P. గీతిక, M. గగన, S. మాన్వి, P. సాయి శ్రీవల్లి రెడ్డి,
కలెక్టర్ గారు మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్, బాడీ ఫ్లెక్సిబుల్, వేట్లాస్ తో పాటు శారీరకగాను, మానసికంగా ను మరియు ఈ రోజుల్లో విద్యార్థులు వత్తిడి చదువులు ఎదురుకోవలంటే శారీరిక మానసిక వ్యక్తిత్వ వికాసానికి ఎదుగుదలకు ఇలాంటి కరాటే ఆత్మరక్షణ విద్యలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు కరాటే శిక్షణ వారికి ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆరోగ్యం, బరువు నియంత్రణ మారుతున్న సమాజానికి అనుగుణంగా, నాటికి పెరుగుతున్న ఆకతాయిల అకృత్యాలను ఎదుర్కోవడానికి అమ్మాయిల స్వీయరక్షణకు, ఆత్మరక్షణకు కరాటే యుద్ద కళ ఎంతో ఉపయోగపడుతాయని ఆడ పిల్లలందరు ఆత్మరక్షణ కిక్ బాక్సింగ్
యుద్ధ విద్యలు తప్పనిసరిగా నేర్చుకోవాలి సూచించారు. పిల్లలు మొబైల్స్ కు దూరంగా ఉండాలి అని మరియు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ద్వార భవిష్యత్తులో పభుత్వ ఉద్యోగాలు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉపయోగ పడుతుందన పడుతుందన్నారు మరియు విద్య నేర్పిన గురువుకి, తల్లి తండ్రులకు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పారు మరియు గెలుపొందిన అమ్మాయిలను DYSO వెంకట్ నర్సయ్య మరియు SGF సెక్రటరీ సౌందర్య గార్లు ఫోన్ ద్వార శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో
సిద్దిపేట కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచకొండ అంజనేయులు కోచ్ తేజస్విన్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు..

