అక్షర న్యూస్ : జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఏ) ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వరదల వంటి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో సమగ్ర మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరదలు రావడం, వాగులు ఉప్పొంగడం, ప్రజలు మరియు పశువులు నీటిలో చిక్కుకుపోవడం వంటి విపత్తు పరిస్థితుల్లో ప్రజలను, పశువులను కాపాడేందుకు ముందస్తు అవగహన కార్యక్రమం మాక్ డ్రిల్ ఎంతనానో ఉపయోగపడుతుందని తెలిపారు. వరదల సమయంలో జిల్లా యంత్రాంగం తక్షణమే ఎలా స్పందించాలి, వివిధ శాఖలు సమన్వయంతో సహాయక చర్యలను ఎలా అమలు చేయాలి అనే అంశాలపై ప్రత్యక్షంగా ప్రదర్శించారన్నారు. ఈమధ్య జిల్లాల సంభవించిన అధిక వర్షాల సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం స్పందించిన తీరును గుర్తు చేశారు. అదేవిధంగా పారిశ్రామిక ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది. రక్షణ చర్యలను పాటిస్తూ ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా బయటపడాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, పోలీస్, ఇరిగేషన్, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక, పరిశ్రమల శాఖ, కార్మిక తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


