అక్షర న్యూస్ :ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.
సోమవారం హైదరాబాద్ నుండి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, ఓటరు మ్యాపింగ్ తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్టర్ మ్యాపింగ్‌ను సమర్థవంతంగా చేపట్టాలని, ఓటరు జాబితాల్లో ఉన్న డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను జాగ్రత్తగా గుర్తించి సరిచేయాలని సూచించారు.
బ్లర్ ఫోటోలు ఉన్న ఓటరు ఎంట్రీలు, ఒకే వ్యక్తికి సంబంధించిన సమానమైన వివరాలతో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలను తప్పనిసరిగా పరిశీలించి సవరణలు చేపట్టాలని, ఓటరు జాబితా పూర్తిగా ఖచ్చితమైనదిగా, విశ్వసనీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని, నిర్దేశిత గడువులోగా అన్ని దశలను పూర్తి చేయాలని తెలిపారు. ఈ అంశాలను అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించి అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కే. హైమావతి మాట్లాడుతూ
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని రెండు.నియోజకవర్గాల పురోగతిని గణాంకాల ఆధారంగా సమీక్షించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫోటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో స్వీకరించిన దరఖాస్తులు, ఎంట్రీలు, సవరణలు, తొలగింపులు మరియు నవీకరణల వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని, ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సూపర్ వైజర్లు, బూతు స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలని స్పష్టం చేశారు తెలిపారు. రేపు మధ్యాహ్నం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని బిఎల్ఓ లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని తద్వారా జిల్లాలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. సూపర్ వైజర్లు కు లక్ష్యం నిర్దేశించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీవోలు చంద్రకళ, సదానందం, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

