• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ :*కాకతీయలో ఎన్జీసీ ప్రోగ్రాం సందర్శించిన డీఈవో..

Bypentam swamy

Dec 22, 2025

అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ హైస్కూల్ లో ఎన్జిసి (నేషనల్ గ్రీన్ కార్ప్ )WOW (WASTAGE TO USE)ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి E.శ్రీనివాసరెడ్డి గారు, మండల విద్యాధికారి రాజా ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఈఓ శ్రీనివాస రెడ్డి గారు విద్యార్థులు వేస్టేజ్ టు యూస్ వ్యర్థాలను నుండి అందంగా తయారు చేసిన వివిధ రకాల ఎగ్జిబిట్లను తిలకించి, విద్యార్థులతో సమాచారాన్ని సేకరించారు. అనంతరం డీఈఓ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ.. కాకతీయ హైస్కూల్ విద్యార్థులు తయారుచేసిన పేపర్ బ్యాగులు, పర్యావరణ కాలుష్యం కాకుండా తయారుచేసిన ఇస్రో, వెండ్ చైన్, బెడ్ లాంప్, డివిజిబిలిటీ రూల్స్, మెజర్మెంట్ పార్క్ ఏరియా,తులసి కుండి ,మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్ గిటార్, వాటర్ క్లీనర్, వివిధ రకాల ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి అని ప్రశంసించారు. ఎగ్జిబిట్స్ అందంగా తయారు చేసిన వారిని ప్రశంసించి,వారికి సర్టిఫికెట్ మెమొంటో అందించారు. ఈ సందర్భంగా కాకతీయ పాఠశాల మేనేజ్మెంట్ ను అభినందించారు. విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి తీస్తున్న ఉపాధ్యాయులు అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్జీసీ కోఆర్డినేటర్ రాజశేఖర్, పవన్ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ జగ్గు మల్లారెడ్డి, ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..