అక్షర న్యూస్:నంగునూర్ మండలం పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. మధ్యాహ్న భోజనం ఎలా పెట్టాలనే విషయాలను విద్యార్థులతో మాట్లాడారు. అన్నం, సొరకాయ టమాటా కూర, పప్పు చారు చేసినట్లుగా విద్యార్థులు కలెక్టర్ కి తెలిపారు. రోజు కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థుల హాజరు ప్రకారం ఆహార పదార్థాలు కొలత ప్రకారం రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు.
పాఠశాలలో ఫుడ్ చెకింగ్ టిచర్ రోజు మొత్తం ప్రక్రియను పర్యవేక్షణ చెయ్యాలని పిల్లలకు చదువు, మధ్యాహ్న భోజనం విషయం లో ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల ను ఆదేశించారు..


