• Wed. Oct 29th, 2025

అక్షర న్యూస్: పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. హైమావతి..

Bypentam swamy

Oct 22, 2025

అక్షర న్యూస్:మంగళవారం జాతీయ నూనె గింజల పథకం(NMEO-OS) పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ కార్యక్రమం(2025-26) లో భాగంగా అక్కన్న పెట రైతువేదికలో 100 శాతం సబ్సిడీ తో 253 మంది రైతులకు 500 ఎకరాలకు సాగు చేసేందుకు పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ కార్యక్రమంనికి జిల్లా కలెక్టర్ కె. హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కే లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్, వ్యవసాయ అధికారులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు, రైతులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్:అంతక్కపేట గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. జిల్లాలో నూనె గింజల సాగును పెంపొందించడానికి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు తో కొన్ని ప్రాంతాలు గుర్తించారు. ముఖ్యంగా పొద్దుతిరుడుకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంత వాతావరణం అనువైనదిగా భావించి ఎంపికచేశారు.
ఒకటే వరి సాగు చేయడం ద్వారా భూమిలో సారం తగ్గుతుందని రైతులు పంట మార్పుడి చెయ్యాలనీ తెలిపారు. నూనె గింజలను వేరే దేశాలనుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం మన రైతులు ఇక్కడే పండిస్తే మనమే ఎగుమతి చేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. మన ప్రాంతాల్లో వాతావరణ పొద్దుతిరుగుడు అనుకూలం ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తుంది. 1 హెక్టర్ భూమికి 5 కిలోల విత్తనాలు అందజేయడం వల్ల లాభంతో పాటు 90 రోజుల పంట, తక్కువ నీటితో పండించవచ్చు. యాజమాన్య పద్ధతిలో ప్రభుతం నుండి ప్రోత్సాహం అందిస్తున్నారు కావున వరి కాకుండా వేరే పంటలను మార్పిడి చెయ్యాలని రైతులకు తెలిపారు. పొద్దుదిరుగుడు పంటలో ఎలాంటి సందేహాలు ఉన్నట్లయితే ప్రసిద్ధ ఎఫ్ పి ఓ లను సంప్రదిస్తే అన్ని నివృత్తి చేస్తారని తెలిపారు.

అక్షర న్యూస్: శ్రీ వాణి స్కూల్ లో శ్రీ లక్ష్మీ పూజ…