అక్షర న్యూస్:దీపావళి పండుగను దేశం మొత్తం చాలా సంతోషాల మధ్య ఆనందముగా జరుపుకుంటారు, ఇంకా దీపావళి రోజున దేశం అంత ప్రకాశిస్తుంది కాబట్టి దీపావళిని కాంతి పండుగ అంటారు. కానీ ఈ కాంతి పండుగ కొన్నిసార్లు మన నిర్లక్షం మరియు అజాగ్రత్త వలన మనకు చీకటిగా మారే ప్రమాదం వుంది.
దీపావళి టపాసులు కాల్చుతున్నప్పుడు ముందు జాగ్రత్తలు :
1. టపాసులు ఇంటికి బయట దూరంగా పేల్చాలి.
2. ధ్వని అధికముగా వచ్చే టపాసులు కాల్చకపోవడం ఎంతో మేలు.
3. టపాసులు పేలుస్తున్నప్పుడు శరీరానికి వదులుగా వుండే నూలు దుస్తులను ధరించాలి.
4. కాళ్లకు తప్పని సరిగా చెప్పులు ధరించవలెను.
5. చిన్న పిల్లలు టపాసులు పేల్చే సమయం పెద్దలు పక్కనే ఉండాలి.
6. కంటిఅద్దాలు మరియు మాస్క్ ధరించవలెను.
7. చేతులలో టపాసులు పేల్చకూడదు.
ప్రమాదం జరిగి కాలిన గాయాలు ఏర్పడినప్పుడు జారత్తలు:
1. వెంటనే 108 ఎమర్జెన్సీ సిబ్బందికి సమాచారం అందించవలెను
2. కాలిన గాయాలపైనా సాధారణ చల్లగా వుండే నీరు 10 నుండి 20 నిముషాల వరకు పోయవలెను.
3. శుభ్రమైన గుడ్డతో గాయాలను కప్పిఉంచవలెను.
4. కొబ్బరి నూనె , సిరా , లాంటి వాటిని గాయాలకు పూయకూడదు.
5. కాలిన గాయాలకు వైద్యుని సలహా ప్రకారం ఆయింట్మెంట్ పూయవలెను.
