అక్షర న్యూస్:జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరీమ అగ్రవాల్ శనివారం అకస్మాత్తుగా కొమురవెల్లి మండల కేంద్రంలోని పిహెచ్‌సిని తనిఖీ చేసి హాజరు, ఓపి రిజిస్టర్లు, మందుల ధృవీకరన రిజిస్టర్లను పరిశీలించారు మరియు రోగులతో సంభాషించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి ఆస్పత్రిలో నమోదైన డెంగ్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు మరియు మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.


