• Fri. Jan 30th, 2026

అక్షర న్యూస్: సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై అక్రమ కేసులను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా జర్నలిస్టుల నిరసన..

Bypentam swamy

Oct 17, 2025

అక్షర న్యూస్:సిద్దిపేట జిల్లా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో
సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై అక్రమ కేసులను నిరసిస్తూ సిద్దిపేట లోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. సాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు పెడుతున్నారని విమర్శించారు. సాక్షి పత్రిక పై దాడులను టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. తెలంగాణ లో కూడా మీడియా మీదా, సోషల్ మీడియా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రేవంత్, చంద్రబాబు రెండు ప్రభుత్వాలు జర్నలిస్టులపై దాడులను మానుకోవాలని తెలిపారు. పత్రిక స్వేచ్ఛను కాపాడండి..పత్రిక ఆఫీస్ ల మీద దాడులను ఆపాలని ఆయన వారు తెలియజేశారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..