అక్షర న్యూస్:-రాష్ట్రంలోనె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిలో ముందు వరుసలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు.
బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తొ కలిసి జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్షించారు.
జిల్లాలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వెంటనే వైద్య సిబ్బంది అప్రమత్తమై తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, డ్రైడే పాటించడంతోపాటు, శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని. ఆశాల ద్వారా డిశ్చార్జ్ అయిన పేషంట్ లను ఆరోగ్య పరిస్థితిని నేల రోజుల పాటు పర్యవేక్షించేల చూడాలని అన్నారు. ఆర్ఏంపి డాక్టర్లు తెలిసితెలియక నిర్లక్ష్యంగా వైద్యం చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, వారిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతినెల ఆర్ఎంపి డాక్టర్ ల పనితీరుపై మెడికల్ ఆఫీసర్ లు తనిఖీలు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించాలని వైద్యాధికారిని ఆదేశించారు.
ముందస్తు అనుమతి లేకుండా సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయరాదని, ఆబ్సెంట్ అయ్యే వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రతి పిఎచ్సిలో 100 శాతం ఏఎన్సి రిజిస్ట్రేషన్ జరగాలని, పిఎచ్సి పరిధిలో మెడికల్ ఆఫీసర్ ల పరిధిలో పర్యవేక్షణ సమావేశాలను నిర్వహించాలని సూచించారు.
సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండి ఇండెంట్ ప్రకారం పిఎచ్సి లకు మెడిసిన్ అందించడంలో ఆలస్యం జరగకుండా చూడాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలను పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, జిల్లావైద్యాధికారి ధనరాజు, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు, ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట ద్వారా జారీచేయబడినది.

