• Wed. Oct 29th, 2025

అక్షర న్యూస్:- బాల సాహిత్యం భావి సమాజానికి శుభ సూచకం..

Bypentam swamy

Oct 8, 2025

అక్షర న్యూస్:- తెలంగాణాలో బాల సాహిత్య ఉద్యమం నడుస్తున్నదని, ఇది రేపటి సమాజానికి శుభ సూచకమని ,బాలలు అద్భుతంగా రచనలు చేస్తున్నారని,విద్యార్థులు తమ పరిసరాలలోని అంశాలనే ఇతివృత్తాలుగా చేసుకుని కథలు వ్రాసి మంచి పేరు తెచ్చుకోవాలని,మన మాతృ భాష కు ప్రాధాన్యత నివ్వాలని తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.జె.చెన్నయ్య అన్నారు.బుధవారం రోజున సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సుగుణ సాహితి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది బాలల కథల పోటి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై,27 మంది విద్యార్థులకు నగదు బహుమతులు,అభినందన పత్రములు అందించారు.అనంతరం విద్యార్థులను కథలు వ్రాసెలా ప్రోత్సహించిన 29 మంది ఉపాధ్యాయులను సన్మానించారు.సుగుణ సాహితి సమితి అధ్యక్షులు మొసర్ల మాధవరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అధ్యక్షులు డా. మట్ట సంపత్ కుమార్ రెడ్డి,కన్వీనర్ భైతి దుర్గయ్య,బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ ,కోహెడ మండల విద్యాధికారి రాళ్లబండి పద్మయ్య,,బాల సాహితి వేత్త కందుకూరి భాస్కర్, ఎన్నారై మొసర్ల జానకీ, బాల సాహిత్య రచయిత గుండ్ల రాజు, కవి వేల్పుల రాజు ప్రసంగించారు.ఇందులో జిల్లాలోని ఉపాధ్యాయులు , విద్యార్థులు తల్లిదండ్రులు ,బాల సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..

అక్షర న్యూస్:అంతక్కపేట గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి