అక్షర న్యూస్:-*మానభంగం మరియు పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో నేరస్తునికి యావజ్జీవ కారాగార శిక్ష, 1 లక్ష 50 వేల రూపాయల జరిమానా*
*మానభంగం చేసినందుకు యావ జీవ కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా*
*పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినందుకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 50 వేల రూపాయల జరిమానా*
*బాధితురాలుకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం గురించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది*
*పోలీస్ స్టేషన్ సిద్దిపేట రూరల్*
*నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు*
*నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు.*
*పోలీస్ కమిషనర్ ఎస్. యం. విజయ్ కుమార్, ఐపీఎస్.,*
*నేరస్తుని వివరాలు*
పైడి శాంతరాజు తండ్రి లక్ష్మయ్య, నివాసం సింగవరం గ్రామం, సీతారాం నగర్ మండల్ వెస్ట్ గోదావరి ఆంధ్ర ప్రదేశ్, ప్రస్తుత నివాసం పద్మ నగర్ చింతల్ హైదరాబాద్.
*పోలీస్ కమిషనర్ కేసు వివరాలు తెలియపరుస్తూ* సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ ములుగు మండలంలోని ఒక పాఠశాలలో టీచరుగా కాంటాక్ట్ బేసిక్ పై విధులు ఉద్యోగం చేస్తుండగా పై నేరస్తుడు 2014 తన పిల్లలను ఆ స్కూల్లో అడ్మిట్ చేసినాడు, పిల్లల బాగోగులు తెలుసుకోవడానికి ఫిర్యాది ఫోన్ నెంబర్ తీసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2014 డిసెంబర్ నెలలో తను నివాసం ఉంటున్న అల్వాల్ కు రమ్మని ఫిర్యాదికి ఫోన్ చేయగా ఫిర్యాది అది నమ్మి వెళ్లగా ఇంట్లోకి తీసుకొని వెళ్లి బలవంతంగా మానభంగం చేసి శారీరకంగా వాడుకుని నమ్మించి మోసం చేసినాడు అని ఫిర్యాదిరాలు 08-05-2019 నాడు పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా అప్పటి ఎస్ఐ కోటేశ్వరరావు కేసు చేయగా అప్పటి సీఐ వెంకట్రామయ్య కేసు పరిశోధన ప్రారంభించి పై నేరస్తుని అరెస్టు చేసి జ్యుడిషియల్ డిమాండ్ కు పంపించడం జరిగింది. తదుపరి పరిశోధన లో టెక్నికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కేసు పరిశోధన పూర్తిచేసి నేరస్తునిపై కోర్టులో చార్జిషీట్ వేయడం జరిగింది.
ఆరోజు నుండి ఈరోజు వరకు సిద్దిపేట 1st అడిషనల్ డిస్టిక్ & సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది.
ఈరోజు 1st అడిషనల్ డిస్టిక్ & సెషన్స్ జడ్జి శ్రీ జయప్రసాద్ గారు, ఇరువురి వాదనలు విన్న తర్వాత నేరస్తుని పై నేరం రుజువైన నందున పై నేరస్తునికి యావజ్జీవ కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినందుకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధించారు. సంబంధిత బాధితురాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది.
సిద్దిపేట రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు, సీఐ వెంకట్రామయ్య, ప్రస్తుత ఎస్ఐ రాజేష్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, సిద్దిపేట ఏసీపి రవీందర్ రెడ్డి, కోర్టు మానిటర్ ఎస్ఐ గంగరాజు, కోర్టులో సాక్ష్యం ఎలా చెప్పాలో సాక్షులను మోటివేట్ చేయడం జరిగింది.
*ఫై నేరస్థునికి జైలు శిక్ష పడడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యస్. ఆత్మ రాములు, తన వాదనలు వినిపించారు, ఎస్ఐ రాజేష్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, కోర్టు మానిటర్ ఎస్ఐ గంగరాజు, కోర్టు కానిస్టేబుల్ రవి, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, లోకేష్, భరోసా సెంటర్ సిబ్బంది సౌమ్య, హరిత, కీలక పాత్ర వహించారు*.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్. యం. విజయ్ కుమార్, ఐపీఎస్ గారు కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు విధులు నిర్వహించే అధికారులను సిబ్బందిని అభినందించారు. త్వరలో సన్మానించి నగదు పురస్కారం అందజేస్తామని తెలిపారు.


