• Wed. Oct 29th, 2025

అక్షర న్యూస్:- జిల్లాలో స్వేచ్చగా, నిష్పాక్షికంగా, ఎన్నికల నిర్వహించాలి..

Bypentam swamy

Oct 8, 2025

అక్షర న్యూస్:- జిల్లాలో స్వేచ్చగా, నిష్పాక్షికంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భంగం కలగకుండా ఎంపిటిసి, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సూచించారు.  

 

బుధవారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సీపీ విజయ్ కుమార్ లు ఎసిఎల్బి, ఎసి రెవెన్యూ లతో కలిసి ఐడి ఓసి సమావేశ మందిరంలో వనరబుల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది విధులు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.   

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో స్వేచ్చగా, నిష్పాక్షికంగా ఎంపిటిసి, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు జరిగేలా పకడ్బంది చర్యలు తీసుకోవాలని. జిల్లాలో వనరబుల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ఇబ్బందులను గుర్తించి వాటిని నిర్దేశించిన ఫార్మెట్ లలో నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా టిమ్ లను ఏర్పాటు చేయడం జరిగిదని, వారు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.    

అక్షర న్యూస్:అంతక్కపేట గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి

 

గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ఎస్ఎచ్ఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ స్థాయి అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి పకడ్బంది నివేదికలు సిద్ధం చేయాలని, మరియు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

     

      క్రిటికల్, సెన్సిటివ్ మరియు హైపర్ సెన్సిటివ్, పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా ముందుగానే సమీక్షించుకోవాలని, పోలింగ్ రోజు పోలింగ్ సామాగ్రి తరలింపు మరియు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, స్ట్రాంగ్ రూమ్ లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. 

 

అక్షర న్యూస్: పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. హైమావతి..

  ఈ సమావేశంలో ఎసిఎల్బి గరిమా అగ్రవాల్, ఎసి రెవెన్యూ అబ్దుల్ హమీద్, ఏసీపీలు, ఆర్డీఓలు, సీఈఓ, డిఆర్డిఓ, డీపీఓ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

     జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట వారిచే జారీ చేయనైనది.