అక్షర న్యూస్:- స్వచ్ఛ సర్వేక్షన్ – 2025 లో భాగంగా నేడు సిద్దిపేట పట్టణంలోని క్రాంతి హైస్కూల్ లో కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు సిద్దిపేటకు అందరి సహకారంతో చెత్త రహిత పట్టణంగా తీర్చి దిద్దుటకై విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
✓ ప్రతిరోజు ఇంట్లో వెలువని చెత్తను ఏ విధంగా తడి, పొడి, హానికర చెత్తగా వేరు చేయాలని వివరించే అవగాహన కల్పించడం జరిగింది. మన ఇల్లు మన పరిసరాలు మన పట్టణం శుభ్రంగా ఉండటానికి అందరం కృషి చేయాలని చుట్టుపక్కల ఉన్న వారికి సైతం చెత్త బహిరంగ ప్రాంతాల్లో వేయకుండా ఉండేలా అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలను చిన్నారులకు వివరించడం జరిగింది. మనం ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్లను గాని పేపర్లను గాని వాడకూడదని పూర్వకాలంలో మాంసం, కూరగాయలు కొనుగోలుకు బట్ట సంచులు, టిఫిన్ బాక్సులు తీసుకెళ్లినట్లు మీరు కూడా ఇంట్లో తల్లిదండ్రులు మార్కెట్ కి వెళ్ళిన సమయంలో కచ్చితంగా తమ తల్లిదండ్రులు వెంట బట్ట సంచులు, టిఫిన్ బాక్సులు తీసుకెళ్లేలా చూడాలన్నారు. పాఠశాలలో విద్య అభ్యసించడంతోపాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సైతం కచ్చితంగా ఉండాలన్నారు. స్వచ్ఛ సిద్దిపేటలో తాము సైతం బాగమగుతామని ఒక రోజు సమయం తీసుకుని తప్పనిసరిగా మేము సైతం శ్రమదానం చేస్తామని పట్టణ పరిశుభ్రత లో భాగమవుతామని క్రాంతి హై స్కూల్ యాజమాన్యం తెలిపారు. ఇంత చక్కటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను చిన్నారులు కమిషనర్ గారిని శాలువాతో సత్కరించారు.
✓కార్యక్రమంలో భగవాన్(తెలంగాణ ప్రవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్), అర్పితా రెడ్డి,ఐటీసీ వావ్ ఈ శ్రీ ఫౌండేషన్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.

