అక్షర న్యూస్:ఈరోజు జై గణేష భక్తి సమితి రాష్ట్ర సమావేశం హైదరాబాద్ లోని ఆదర్శ నగర్ కాలనీలో నిర్వహించడం జరిగింది.ఈ యొక్క సమావేశంలో వ్యవస్థాపక మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జైన్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా గౌరవనీయులైన కోట శంకర్ ఆనంద్ రావు గారిని నియమించడం జరిగింది. ఇందుకు గాను రాష్ట్ర కమిటీ ఆమోదం తెలిపింది..చైర్మన్ గారిని ఎన్నుకున్న తదనంతరం జై గణేష్ భక్తి సమితి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు..జై గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు..నవరాత్రుల్లో భక్తి సేవ కార్యక్రమం చేస్తున్న వారికి అలాగే మట్టి వినాయకులు పెట్టిన వారికి ఈ అవార్డు ప్రధానము జరుగుతుంది దీన్ని అందరూ ఆమోదించడం జరిగింది.భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమం తదనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ రాజు కుమార్ మరియు వారి టీం కు
సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు విచ్చేసిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అలాగే కే ఎస్. ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు.రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని జై గణేశ్ భక్తి సమితి మెంబర్ గా చేయాలని, ప్రతి జిల్లా, మండలంలో జై గణేశ్ భక్తి సమితి కమిటి లు పూర్తిగా బాధ్యత తీసుకొని స్వచ్ఛందంగా సేవ చేయాలని, పర్యావరణ పరిరక్షణకు గణేశ్ భక్తి సమితి సభ్యులందరు కృషిచేయాలని, మట్టి గణపతులు పెట్టే విధంగా మనం కృషి చేయాలని ఛైర్మెన్ కే ఎస్ ఆనందు రావు గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి జై గణేశ్ భక్తి సమితి కుటుంబ సభ్యులందరికీ జాతీయ వ్యవస్థాపకులు ఏ. జైన్ కుమార్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
జై గణేశ భక్తి సమితి జాతీయ వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏ . జైన్ కుమార్,తెలంగాణ రాష్ట్ర ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు శ్రీదేవి గౌడ్ ,రాష్ట్ర సలహాదారులు కొత్వాల్ దయానంద్,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రవికాంత్,రాష్ట్ర కార్యదర్శి బాలరాజు ,రాష్ట్ర కోఆర్డినేటర్,సిద్దిపేట్ జిల్లా ఇన్చార్జ్ పెంటం స్వామి,సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ నాగ రవళి ,నారాయణపేట జిల్లా ఇన్చార్జ్ సత్యానంద్ రెడ్డి,కూకట్పల్లి సనత్ నగర్ ఇంచార్జ్ కోటి రెడ్డి ,రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి ,రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ శ్రవణ్ ,జయంత్, శ్రీనివాస్ మొదలగువారు పాల్గొన్నారు.









