అక్షర న్యూస్: సిద్దిపేటలోని విపంచి కళా వేదిక లో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జర్నలిస్టులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి లాంటి వారు ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందరికీ అందేలా కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా మీడియా పక్షాన తమ వంతు సహాకారం అందించాలని కోరారు. అదే విధంగా జర్నలిజం వృత్తి కాదు అది ఒక సామాజిక బాధ్యత అన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక యుగంలో జర్నలిజం చరిత్రాత్మకమైన మార్పు లు వస్తున్నాయని పేర్కొన్నారు. నైతిక నియమావళి, మీడియా చట్టాలు అనే అంశంపై ప్రసంగించారు. వాస్తవాలు ప్రజా ప్రయోజనం జరిగితే తప్ప బాబా సాహెబ్ అంబేద్కర్ తో పాటు రాజ్యాంగ సభ్యులు ఆశించారో అదే భావన తో జర్నలిస్టులు పని చేయాలన్నారు. వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయని ఆయన తెలిపారు, సాంకేతికతను సమగ్రంగా తెలుసుకుంటే వార్తలు సేకరణ సులభం అవుతుంది తెలిపారు, పాఠకుల వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా వార్తలు ఉండాలని, తెలుగు వార్తలను సులువైన భాష లో వ్రాయాలని సూచించారు.
ప్రముఖ సంపాదకులు కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిజం గతం వర్తమానం భవిష్యత్తు మీడియా ధోరణులు , యాధునిక యుగంలో మీడియాలో వస్తున్న మార్పుల గురించి వివరించారు. సోషల్ మీడియా యూట్యూబ్ లో వస్తున్న వార్తలు క్షణాల్లో ప్రజల్లో వెళ్తున్నాయని తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ మాట్లాడుతూ, ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎలా వైరల్ అవుతాయో వివరించారు.
సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ, నేర వార్తల సేకరణ లో తీసుకోవలసిన జాగ్రత్తలు ,చట్టాలపై అవగాహన ఉండాలని, వార్తలు సేకరించే ముందు నిజనిర్ధారణ చేసుకొని చేసుకుని వ్రాయాలని ఆయన సూచించారు, అలాగే నేర వార్తలు లలో చేయాల్సినవి చేయకూడనివి అంశాలపై క్లుప్తంగా వివరించారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం అమలు తీరును వివరించారు. అందరికి ఉపాధి నీ కల్పించాలనేదే ఈ పథకం ఉద్దేశం అన్నారు. ఇప్పుడు ఈ పథకం అమలుకు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వర్క్ లు కేటాయిస్తున్నామన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు సర్టిఫికెట్ లను ప్రధానం చేయడం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమంలో మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్ వెంకటేశ్వరరావు,ఐ & పి ఆర్ బిజ్జు రీ రవీందర్ ,జిల్లా అధ్యక్షుడు రంగాచారి,సీనియర్ జరలిస్ట్ అంజయ్య
తదితరులు పాల్గొన్నారు.



