• Wed. Jul 30th, 2025

అక్షర న్యూస్: ఆధునిక యుగం జర్నలిజంలో చరిత్రాత్మకమైన మార్పులు వస్తున్నాయని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Bypentam swamy

Jul 18, 2025

అక్షర న్యూస్:శుక్రవారం నాడు సిద్దిపేట లోని విపంచి కళా వేదిక లో పాత్రికేయులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయని ఆయన తెలిపారు, సాంకేతికతను సమగ్రంగా తెలుసుకుంటే వార్తలు సేకరణ సులభం అవుతుంది తెలిపారు, పాఠకుల వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా వార్తలు ఉండాలని, తెలుగు వార్తలను సులువైన భాష లో వ్రాయాలని సూచించారు. త్వరలోనే మీడియా అకాడమీ ఆధ్వర్యంలో Ai అనే అంశంపై సెమినార్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, రాజకీయ రంగంలోనైనా, మీడియా రంగంలో అయినా, ఇతర ఏ రంగంలోని వారు అయినా ప్రతినిత్యం సామాజిక మార్పులకు, అవసరాలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని అన్నారు.
జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో పర్యటించి అనేక వార్తలను సేకరించి, అధికారులతో దృవీకరించుకొని, క్రోడీకరించి వార్తలను విడుదల చేస్తారన్నారు. ఆయా వార్తలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయన్నారు. జర్నలిస్టులు శిక్షణ ద్వారా నైపుణ్యాలు పొంది ప్రజల మనన్నలను పొందేలా జర్నలిస్టులు ప్రతి విషయాన్ని విపులీకరించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వార్తలు రాయాలన్నారు. సమాజంలో యువత బెట్టింగ్, డ్రగ్స్ బారినపడి చెడిపోతున్నందున దానిని నిర్మూలించడానికి పరిశోధనాత్మక వార్తలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కాలంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు ఎక్కువ వారి వేధింపులను తట్టుకోలేక బాధితులు అనేక అవస్థలు అవమానాలు చివరికి ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి అన్నారు.

అక్షర న్యూస్: అంతటా నాగుల పంచమి ఐతే అక్కడ తెల్ల పంచమి.

ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సమాచార హక్కు చట్టం 2005 అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్, ఆర్టిఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, వార్త కథనాలు ప్రత్యేక కథనాలు అనే అంశంపై దిశా ఎడిటర్ మార్కండేయ, భాషా తప్పుఒప్పులు, దిద్దుబాటు అనే అంశంపై విశాలాంధ్ర ఎడిటర్ ఆర్.వి రామారావు బోధించారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్: ఆధునిక టెక్నాలజీ మరియు ఏ ఐ ద్వారా జర్నలిజంలో చరిత్రాత్మకమైన మార్పు లు రావాలి…