• Tue. Jul 1st, 2025

అక్షర న్యూస్ : ప్రజా పాలన ప్రభుత్వం లో పంటలు వేసే కంటే ముందే పంట పెట్టుబడి సహాయం..

Bypentam swamy

Jun 18, 2025

అక్షర న్యూస్ :మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ.. ఈరోజు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..ప్రజా పాలన ప్రభుత్వం లో పంటలు వేసే కంటే ముందే పంట పెట్టుబడి సహాయం 9 వేల కోట్లు విడదల చేసింది.9 రోజుల్లో 70 లక్షల 11 వేల మంది రైతులకు కోటి 49 లక్షల ఎకరాలకు దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా విడదల అవుతున్నాయి.. రోజువారీగా 9 రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల పూర్తవుతుంది..

రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు భరోసా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మృగశిర కార్తె రాగానే ఏరువాక ప్రారంభం కావడంతోనే పంటలు వేసే సమయానికి పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా ను అందిస్తుంది.

అర ఎకరా నుండి మొదలు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు పడుతున్నాయి.మొన్న రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీ నుండి కేబినెట్ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2349 కోట్లు విడుదల చేశారు.నిన్న మూడు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతు అకౌంట్ లో మొత్తం 1551.89 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి..9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి..

అక్షర న్యూస్ : భూ సమస్యల పై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు.

70,11,481 మంది రైతులకు 1,49,00637 ఎకరాలకు దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నాయి.ఒక గుంట కూడా బీడు లేకుండా రైతులు వ్యవసాయం చేయాలి.రైతులకు ప్రజా పాలన ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు.. గతంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల రైతు భరోసా ఆలస్యం జరిగింది.పంట వేసే సరైన సమయానికి ప్రభుత్వం రైతు భరోసా వేస్తుంది

రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతూ వడ్డీలు తెచ్చే పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది పంటలు వేసే సరైన సమయానికి పంట పెట్టుబడి సహాయం అందించాం. రైతులు వ్యవసాయం పై మంచి మెళుకువలు మార్చుకుని ఆర్థికంగా మంచి ఆదాయం వచ్చే వాణిజ్య పంటలు వేయాలి.

గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు వేదికల్లో రైతులనుద్దేశ్యైంచి ప్రసంగించారు..హుస్నాబాద్ రైతులు వ్యవసాయం లో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండాలని కోరుకుంటున్న.మన ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల పనులు కొనసాగుతున్నాయి.

అక్షర న్యూస్ : భట్రాజ కళాకారుని ప్రతిభకు పురస్కార పత్రం, నటుడు ఏసీఆర్ కు ఘనమైన సన్మానం..

దేవుడి ఆశీర్వాదంతో ఈసారి మంచి వర్షాలు పడి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి.వ్యవసాయ పనుల్లో రైతులు చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్న..