అక్షర న్యూస్ : భూ సమస్యల పై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు.
బుదవారం సిద్దిపేట అర్బన్ మండలంలోని తడకపల్లి గ్రామపంచాయతీలో నూతన అర్ ఓ అర్ చట్టం – భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసే పరిష్కరించాలని అన్నారు. వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తయిన వాటిని వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు వాటి పూర్తి వివరాలు తీసుకోవాలని, భూ భారతి చట్ట ప్రకారం వాటి పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. రెవెన్యూ గ్రామంలో రైతులు, వ్యవసాయ భూమి, ప్రభుత్వ భూమి తదితర భూమి పూర్తి వివరాలతో విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని తహసీల్దార్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హరికిరణ్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


