అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా భట్రాజ సంఘం ఆధ్వర్యంలో కళాకారులకు ప్రతిభా పురస్కార పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు గౌర్రాజు అశోక్ రాజు, ప్రధాన కార్యదర్శి సింగభట్టు రామరాజు, కోశాధికారి వ్యాసభట్టు దయానంద రాజు.
అధ్యక్షులు అశోక్ రాజు మాట్లాడుతూ కళాకారులకు కాణాచి అయినా భట్రాజ జాతి ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఏకపాత్రాభినయంపై, పౌరాణిక పాత్రలపై, నటనపై, కవితలపై, మక్కువ చూపుతూ ముందుకు సాగుతున్నటువంటి భట్రాజ ముద్దుబిడ్డలైన కళాకారులను గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు. అంతరించిపోతున్న కళకు నేడు ప్రాణం పోస్తున్నటువంటి ఎర్రమరాజు చరణ్ రాజును అభినందిస్తూ తన నటన శైలితో విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతూ ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ఎన్నో యూట్యూబ్ ఛానల్ లోనూ, సీరియల్ లోను, చిత్రాల్లోనూ, నటిస్తూ రంగస్థలంపై తన ప్రతిభ పాటవాలతో అందరినీ ఆకట్టుకున్నారని సింగభట్టు రామరాజు తెలిపారు.
కలను మళ్లీ బ్రతికించుకోవాలని ఆ కలలతో ప్రజల్లో చైతన్యం, స్ఫూర్తిని నింపి వాళ్ళ హృదయాలలో గుడి కట్టుకోవాలని ఆనాటి పెద్దలు ఆశు కౌలుగా చెట్టుపై, పుట్టపై, కొండా కోనలపై కవితలు అల్లి ప్రజల ఆదరణ, రాజుల ఆదరణను పొందారని నేడు ఎర్రమరాజు చరణ్ రాజు నాటికలలకు నేటి కలలకు జీవం పోస్తూ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నారని ఇదే స్ఫూర్తితో మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలను తన కళల ద్వారా నిలబెట్టాలనీ ఆశిస్తూ ఈ ప్రశంసా పురస్కార పత్రంతో సన్మానిస్తున్నామని వక్తలు దయానంద రాజు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో గౌరవ సలహాదారులు ఎర్రమరాజు రాజేంద్రప్రసాద్ రాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రమరాజు సాయి కృష్ణ,మహిళా అధ్యక్షులు నీలకంఠం రమణ, కోశాధికారి కరుణశ్రీ, యువజన ప్రధాన కార్యదర్శి వ్యాసభట్టు రవిరాజు, కార్యదర్శి గౌర్రాజు కృష్ణ తదితరులు పాల్గొని వారిని అభినందించడం జరిగినది.