• Tue. Jul 1st, 2025

అక్షర న్యూస్ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో శిశుగృహ నుండి ఒక పాపను దత్తతను ఇవ్వడం జరిగింది..

Bypentam swamy

Jun 18, 2025

అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో శిశుగృహ నుండి బుధవారం రోజున *ఒక పాప* ను తమిళనాడు రాష్ట్రం కు చెందిన దంపతులకు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ గారి చేతుల మీదుగా అధికారికంగా దత్తతను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు కలెక్టర్ గారు తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించాలి వారి కి ఇష్టమైన రంగంలో ప్రోత్సహం ఇవ్వాలి పిల్లల బంగారు భవిషత్ కు బాట వేసే పూర్తి బాధ్యత మీదే అని చెప్పడం జరిగింది మరియు జిల్లాలోని పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే సిద్దిపేటలో గల శిశు గృహ/ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని తద్వారా ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని తెలిపారు. అక్రమంగా పిల్లలని దత్తత తీసుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీ G. లక్ష్మికాంత్ రెడ్డి, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ మమత ,జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, బాలల పరిరక్షణ అధికారి రాజు, రమేష్ మరియు శిశు గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : అపర భగీరధుడు తెలంగాణ రాష్ట్ర జలసాధకుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీషన్న…

అక్షర న్యూస్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..