• Tue. Jun 10th, 2025

అక్షర న్యూస్ : అపర భగీరధుడు తెలంగాణ రాష్ట్ర జలసాధకుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీషన్న…

Bypentam swamy

Jun 3, 2025
You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

అక్షర న్యూస్ : పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు “నాయిని కృష్ణ ముదిరాజ్”: తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమాన్ని తన మామ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉప్పెనలా సాగించిన ఉప్పొంగే సముద్రపు అల: తెలంగాణ రాష్ట్రం సాధించాక భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అనతి కాలంలోనే మిషన్ కాకతీయ,కాలేశ్వరం ఇతర ప్రాజెక్టుల పూర్తితో అపర భగీరధుడుగా పేరుగాంచిన అలుపెరుగని నాయకుడు.: అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజా గొంతుకగా పార్టీ తరపున అనుక్షణం ప్రజల కొరకు పోరాడే పోరాట యోధుడు.:రేపు మంగళవారం ఆ రాజకీయ చాణక్యుడి,రాజకీయ యోధుడి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు”సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ నాయకుడు””నాయిని కృష్ణ ముదిరాజు” తెలంగాణ ఉద్యమ సమయంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మేనల్లుడు గా రాజకీయ ఆరంగేట్రం చేసి అనతి కాలంలోనే తెలంగాణ కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన దీక్షలు,నిరాహార దీక్షలు వంటావార్పు కార్యక్రమాలు ఇంకా ఇలాంటివి ఎన్నో ఉద్యమ సమయంలో కెసిఆర్ గారికి అండగా ఉంటూ ఉద్యమించిన ఉద్యమ కెరటం తన్నీరు హరీష్ రావు అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవిని కూడా ఎన్నోసార్లు తృణప్రాయంగా రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తిత్వం గల నాయకుడు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రం సాధించాక గత ప్రభుత్వంలో ఎన్నో ఉన్నతమైన మంత్రి పదవులను చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా తనదైన ముద్రను వేసి తన సొంత జిల్లా సిద్దిపేట ను తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా చేసి చూపించిన ఘనుడు తెలంగాణ అంటే యువతకు ఊపు వచ్చే నాయకుడు ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అంటే అతిశయోక్తి కాదేమో….. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా అపర భగీరధుడు,ఆరడుగుల బుల్లెట్ వచ్చాడు అని యువత వయోజనులు జననీరాజనం పట్టే,హరీష్ అన్న మీద ప్రేమ మమకారం అలాగే హరీష్ అన్న కోసం యువత తమశరీరాల పైన హరీష్ అన్న పచ్చబొట్టు ఉంటుంది అంటే సిద్దిపేట జిల్లాకు అలాగే రాజకీయాలకు వచ్చే యువతకు హరీష్ అన్న”గాడ్ ఫాదర్”లాంటివాడు….. హరీష్ రావు అంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన నియోజకవర్గంతో పాటు జిల్లాను తెలంగాణ మొత్తాన్ని అధికార ప్రభుత్వం ప్రజలకు పనులు చేసేటట్లు నిత్య కృషివలుడిగా అన్ని జిల్లాలను చుట్టివచ్చే మహోన్నత వ్యక్తిత్వం గల నాయకుడు….. కొసమెరుపు ఏమిటంటే సిద్దిపేట అంటే హరీష్ రావు హరీష్ రావు అంటే సిద్దిపేట ఇందులో తెలంగాణకు,దేశానికి ఎలాంటి సందేహం లేదు అందుకే సిద్దిపేటను అన్ని రంగాల్లో రాష్ట్రానికి దేశానికి రోల్ మోడల్ గా ఐకాన్ గా తన వంతు కృషి చేసిన పాత్ర అమోఘం…… అలాంటి ఆరడుగుల బుల్లెట్ అపర భగీరధుడు ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన బిఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన నాటినుండి పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే తపస్వి….. ఇకపోతే తన సొంత నియోజకవర్గంలోని మండలాలు గ్రామాలలో ఎలాంటి పండుగలు లేదా గ్రామ నాయకులు పెళ్లిళ్లకు పిలిచిన కనీసం వెళ్లి పలకరించి వారిని ఆనందపరిచే స్వభావం కల మనస్తత్వం కలవాడు….. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరుసటి రోజే అనగా తేదీ:03-06-25 రోజున ఎమ్మెల్యే హరీష్ అన్న పుట్టినరోజు కావడం ఎంతో విశేషం కావున అలాంటి ప్రజా నాయకుడిని,అలుపెరుగని పోరాట యోధుని పుట్టినరోజు పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు”నాయిని కృష్ణ ముదిరాజు”హరీష్ అన్న అభిమానిగా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రజాసేవలో ఇలానే కొనసాగుతూ రాజకీయ చాణక్యుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరొక్కసారి హరీష్ అన్నకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అక్షర న్యూస్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

అక్షర న్యూస్: 174 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసిన ఆర్సీబీ…