అక్షర న్యూస్: కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు ఉదయాన్నే కోమటి చెరువు పై పర్యటించడం జరిగింది. అడ్వెంచర్ పార్క్ వద్ద విద్యుత్ శాఖ అధికారులు తొలగించినటువంటి చెట్ల యొక్క కొమ్మలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. డైనోసార్ పార్క్ లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. సిద్దిపేట పట్టణ ప్రజలు,ఇతర ప్రాంతాల పర్యాటకులు నిత్యం కోమటి చెరువు సందర్శించడం జరుగుతుందని కావున కోమటి చెరువు కట్టపై ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
కట్టపై ఉన్నటువంటి బాలవికాస్ తిరిగి వాడకంలోకి తీసుకురావాలని వేసవి కాలం కాబట్టి సందర్శకులకు అతి తక్కువ ధరలో త్రాగునీరు అందుబాటులో ఉండేలా బాలవికాస్ ను వాడుకులకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా చెరువు కట్టపై ఉన్నటువంటి మొక్కలకు, చెట్లకు సమయానికి నీరు అందేలా డ్రిప్స్ ఏర్పాటుచేసి నీరు అందేలా చూడాలని ఆదేశించారు. మార్నింగ్ వాకర్స్ మరియు సందర్శకులు, పర్యాటకులు తినుబండారాల కవర్లు, బాటిల్స్ వంటి వాటిని వేయుటకు చెత్త డబ్బాలను అందుబాటులో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుచేసి మహిళలకు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా పర్యాటకులకు తినుబండారాలను అందుబాటులోకి తీసుకురావాలని హనుమంత్ రెడ్డి (DMC) గారికి సూచించారు.
కమిషనర్ గారి వెంట హన్మంత్ రెడ్డి (DMC), పృథ్వి (AEE) గార్లు తదితరులు ఉన్నారు
.


