• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్: పుల్లూరు బండ స్వయం భూ లక్ష్మీ నసింహ స్వామి క్షేత్రం లో ఘనంగా స్వాతి నక్షత్ర ఉత్సవం..

Bypentam swamy

Apr 14, 2025

అక్షర న్యూస్:సిద్దిపేట మండలం పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వాతి నక్షత్ర ఉత్సవం ఘనంగా జరిగింది. సోమవారం ఉదయం స్వయంభూ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. దేవాలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల రంగాచార్య, పొడిచేటి పొడిచేటి శ్రీనివాసాచార్యులు, విజయ్ కుమార్, కలకుంట్ల నచికేత, జయదేవ్ సాయి ల నేతృత్వంలో ఉదయం స్వామివారికి పంచామృతాలతో నవ కలశ అభిషేకం నిర్వహించారు.
అభిషేకం అనంతరం ఉత్సవమూర్తులని దేవాలయ దేవాలయ ఆవరణలో అలంకరించి ఉంచి సుదర్శన నరసింహ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో సిద్దిపేట, పుల్లూరు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున శ్రీ పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వాతి నక్షత్రం నిర్వహించడం చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది.అందులో భాగంగానే దేవాలయ వంశపారంపర్య అర్చకులు ఆధ్వర్యంలో సంప్రదాయ శాస్త్రబద్ధంగా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..