• Fri. May 9th, 2025

అక్షర న్యూస్: పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు…

Bypentam swamy

Apr 11, 2025

అక్షర న్యూస్: ఉదయాన్నే పట్టణంలోని 21 వార్డులో పర్యటించడం జరిగింది. మురికి కాలువలలో కవర్లు, సిల్ట్ వలన మీరు నిలిచిపోవడం గమనించి వెంటనే మురికి కాలువలలో సిల్ట్ తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. మురికి కాలువ ఒకవైపు వంపుగా ఉండడం వలన మురికి నీరు నిలిచిపోతుందని కావున అట్టి మురికి కాలువ కల్వర్టు నిర్మాణం ఎత్తుని పెంచాలని సిబ్బందికి ఆదేశించారు. పట్టణంలో ఉన్నటువంటి నివాస ప్రాంతాల పరిసరాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించి శుభ్రం చేసుకోవాలని లేనిచో విషపూరిత కీటకాలు, పాములకు ఆవాసం అవకుండా అట్టి ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసుకునేలా స్థలం యజమానులకు నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు.

అనంతరం 5 వార్డు శ్రీనగర్ కాలనీలో కౌన్సిలర్ వినోద్ గౌడ్ గారితో కలిసి వార్డులో పర్యటించడం జరిగింది. శ్రీనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాంబర్లో ఇసుక, కవర్లు వంటి వాటి వలన ఛాంబర్ లో నీటి ప్రవాహం నిలిచిపోవడంతో వెంటనే ఛాంబర్ లో పేరుకుపోయిన ఇసుక ,కవర్లను తొలగించి నీటి అంతరాయం సమస్యను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. సిద్దిపేట పట్టణ ప్రజలు సైతం కవర్లు, సానిటరీ ఫ్యాడ్స్ వంటి ఇతరత్రా వాటిని బాత్రూంలో వేయకూడదన్నారు. మరియు నేడు మహాత్మ జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో కమీషనర్ అశ్రిత్ కుమార్ గారు మహాత్మ జ్యోతిబా పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేయటడం జరిగింది.

అక్షర న్యూస్ : భట్రాజ కళాకారుని ప్రతిభకు పురస్కార పత్రం, నటుడు ఏసీఆర్ కు ఘనమైన సన్మానం..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే..