అక్షర న్యూస్:అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని పంట పొలాలను రాష్ట్ర మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రైతులు వారికి జరిగిన పంట నష్టం వివరాలను మంత్రులకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టపోవడం దురదృష్టకరమని గత మూడు రోజులుగా కురిసిన అకాల వర్షం, రాళ్ల వాన మూలంగా రైతన్న గారికి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ లు పంట నష్ట వివరాలను పరిశీలించి వివరాలను వెంటనే అందజేయాల్సిందిగా ఆదేశించామన్నారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కువనష్టం జరిగిందని తర్వాత సిరిసిల్లలో జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఎకరాల్లో నష్టం జరిగిందని అన్నారు.
మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పంటనస్ట పోయిన ప్రతిరైతు ను ఆడుకుంటామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి మాట్లాడుతూ జిల్లాలో 9300 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని వాటిలో 6400 ఎకరాల్లో వరి, 1200 ఎకరాల్లో మామిడి, 1600 ఎకరాల్లో కూరగాయల పంట నష్టం జరిగిందని వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో నష్టాన్ని అంచనా వేస్తున్నామని నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇస్తామని తెలిపారు.



