• Sun. Mar 9th, 2025

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు వార్డు ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..

Bypentam swamy

Mar 4, 2025

అక్షర న్యూస్ :పట్టణ ప్రజలంతా కూడా సకాలంలో ఇంటి మరియు నీటి పన్నులు చెల్లించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు. పన్నులు వసూలు చేయుటకు తక్కువ సమయం ఉన్నందున సిబ్బంది ఉదయాన్నే బకాయిలు ఉన్నవారు ఇంటికి వెళ్లి ఇంటి మరియు నీటి పన్ను వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డు ఆఫీసర్ లు సైతం తమ తమ వార్డులలో తిరుగుతూ బిల్ కలెక్టర్ లతో పన్నులు త్వరితగతిన 100 శాతం పన్ను వసూలు చేయాలని ఆదేశించారు.

పట్టణ ప్రజలు సైతం పురపాలక సంఘం సిబ్బందికి సహకరిస్తూ పాత బకాయిలు మరియు ప్రస్తుత బకాయిలు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. వార్డు ఆఫీసర్ లు ఉదయాన్నే పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించిన అనంతరం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా వార్డు ఆఫీసర్ పరిధిలో ఉన్నటువంటి ట్రేడ్ లైసెన్స్ సైతం వసూలు చేయాలని ఆదేశించారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు నెరవేరుస్తాడనీ భక్తుల అభిప్రాయం

సమీక్ష సమావేశంలో భాగంగా ఒక్కో బిల్ కలెక్టర్ యొక్క మొత్తం డిమాండ్,వసూలు చేసిన డబ్బులు,ఇంకా మిగిలి ఉన్న వసూలు చేయాల్సిన డబ్బులు బిల్ కలెక్టర్ వారిగా అడిగి తెలుసుకుని 31 మార్చి వరకు తప్పనిసరిగా 100 శాతం వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

సమావేశంలో ప్రేరణ(DYEE), బాలకృష్ణ(UDRI) గార్లు ,వార్డు ఆఫీసర్ లు,బిల్ కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూర్వకంగా అహువానించారు..