అక్షర న్యూస్ :హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ.
హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు కొమురవెల్లి మల్లికార్జున స్వామి, కొండపోచమ్మ తల్లి దర్శనానికి వచ్చిన సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఐపీఎస్ మేడమ్ గారు కొము రవెల్లి టెంపుల్ గెస్ట్ హౌస్ వద్ద మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాలు అందజేశారు తదనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన గవర్నర్ గారు.
పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ గవర్నర్ పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, హుస్నాబాద్ ఎసిపి సతీష్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, చేర్యాల సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు, ఆర్ఎస్ఐ రోహిత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


