అక్షర న్యూస్ :బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఔట్సోర్సింగ్ విధానంలో పోస్టు మెట్రిక్ హాస్టల్ లో పని చేస్తున్న తమకు కన్వెన్షన్ జీవో వర్తించే విధంగా చేసి తమ జీతాలను ఇప్పించాలని బాధితులు కోరారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ జరిగిన సమావేశం వారు మాట్లాడారు.
బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ విధానంలో పోస్టు మెట్రిక్ హాస్టల్ లో 49 మంది వర్కర్స్ పనిచేయగా 28 మందికి మాత్రమే కంటిన్యూషన్ జీవో ఇచ్చి మిగిలిన 21 మంది ఉద్యోగులకి వచ్చిన కంటిన్యూషన్ జీవో వర్తించేలా సంబంధిత బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సంబంధిత జిల్లా అధికారులు ఈ సమస్య పైన పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమస్య పరిష్కరించి ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర జేఏసీ సిద్దిపేట జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జి శ్రీకాంత్, ఈ కృష్ణ,భిక్షపతి లక్ష్మీ, కల్యాణి, యశోద, డి.జ్యోతి, ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


