• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..

Bypentam swamy

Feb 3, 2025

అక్షర న్యూస్ : సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా శ్రీ వాణి స్కూల్ భారత్ నగర్ లో సరస్వతి అమ్మవారికి పూజ ,గణపతి పూజ,కుంకుమార్చన , అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా సోమవారం రోజున నిర్వహించారు. 

 

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున మా పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారని తల్లిదండ్రులకు నమ్మకం. అనంతరం విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, పెన్నులు అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృపాకర్, ఉపాధ్యాయులు , విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : మహిళలు మౌనం వీడితే విజయం సాధించినట్లే..