అక్షర న్యూస్ : తేదీ: 29-12-2024 (ఆదివారం) నాడు శ్రీ కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ గారి ఆదేశానుసారం ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, హుస్నాబాద్ ఏసీపి సతీష్, సిద్దిపేట ఏసీపీ మధు, గజ్వేల్ ఎసిపి పురుషోత్తం రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, చేర్యాల సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు, కలసి దేవుడు కళ్యాణం జరుగు తోటబావి మరియు పరిసర ప్రాంతాలు వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్ దర్శన ప్రదేశాలను, పరిశీలించి, బందోబస్తు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, హుస్నాబాద్ ఎసిపి సతీష్ గార్లు శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం మహోత్సవం బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు, కళ్యాణోత్సవం, పార్కింగ్, టెంపుల్ ఆవరణ, గర్భగుడి దర్శనం, తదితర అంశాల గురించి దిశా నిర్దేశం చేశారు. రేపు ఉదయం 6 గంటలకు అధికారులు సిబ్బంది కేటాయించిన ప్రదేశంలో విధి నిర్వహణలో ఉండాలని సూచించారు.
ఇన్చార్జి అధికారులందరూ తప్పకుండా విహెచ్ఎఫ్ సెర్చ్ యాండిల్ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సరియైన సమయానికి వచ్చి విధులు నిర్వహించాలని దర్శనానికి వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు.
బందోబస్తు విషయంలో కానీ ఏ విషయంలోనైనా ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారులకు తెలియపరచాలని సూచించారు. దేవుని కళ్యాణంలో విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలని సూచించారు.మూడు నెలల పాటు ప్రతి ఆదివారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ గారి ఆదేశానుసారం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
బందోబస్తును 4 సెక్టార్లుగా విభజించడం జరిగింది.
1 కళ్యాణ మహోత్సవం వేదిక తోటబావి వద్ద
2 టెంపుల్ ఆవరణ గర్భగుడి దర్శనం,
3 ట్రాఫిక్
4 పార్కింగ్ ప్రదేశాలు
వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట చేయడం జరిగింది. పోలీస్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నాం, ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కంట్రోల్ రూంలో అందుబాటులో వుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు మరియు విఐపి దర్శనం, శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం, మూడు విభా మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. కళ్యాణ వేదిక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, పార్కింగ్ ప్రదేశాలలో మరియు టెంపుల్ ఆవరణలో 75 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అడిషనల్ డీసీపీలు/02, ఎసిపిలు/06, సిఐలు/25, ఎస్ఐలు/26, ఏఎస్ఐలు/ హెడ్ కానిస్టేబుళ్లు,/ కానిస్టేబుళ్లు/ మహిళా కానిస్టేబుళ్లు/ మహిళ హోంగార్డులు/,బీడీ టీమ్స్, యాక్సెస్ కంట్రోల్, రోప్ పార్టీ మొత్తం 361 అధికారులు సిబ్బంది మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
పార్కింగ్ ప్రదేశాలు:-
తోటబావి సమీపంలో ఎడమవైపు చుట్టు కాంపౌండ్ వాళ్ళు ఉన్న ప్రదేశంలో విఐపి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
సిద్దిపేట, చేర్యాల, కిష్టంపేట మరియు కొమురవెల్లి కమాన్ నుండి వచ్చే వాహనదారులు బస్టాండ్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
హైదరాబాద్, కొండపోచమ్మ టెంపుల్ నుండి, ఐనాపూర్ గ్రామం వచ్చే వాహనదారులకు కొమురవెల్లి పెట్రోల్ పంపు వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో, శ్రీ హోటల్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణానికి వచ్చే భక్తులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి వాహనాలు పార్కింగ్ ప్రదేశంలో పార్కు చేసి ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకుని వెళ్లాలని సూచించారు.
రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పెడితే వచ్చిపోయే భక్తులకు ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని అట్టి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, చేర్యాల సిఐ శ్రీను, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, మరియు సీఐలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.