• Tue. Jul 1st, 2025

అక్షర న్యూస్ :నా వల్ల తప్పు జరిగితే హోంగార్డుకైనా సారీ చెబుతా: సీవీ ఆనంద్

Bypentam swamy

Dec 26, 2024

అక్షర న్యూస్ :ఇటీవల నేషనల్ మీడియాపై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్ర వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ ఘటనకు మద్దతిస్తున్నారంటూ విమర్శలు

సీవీ ఆనంద్ పై నేషనల్ మీడియా ఆగ్రహం.

అక్షర న్యూస్ : ప్రజా పాలన ప్రభుత్వం లో పంటలు వేసే కంటే ముందే పంట పెట్టుబడి సహాయం..

 హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇటీవల జాతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనకు నేషనల్ మీడియా సంస్థలు మద్దతిస్తున్నట్టుగా ఉందని ఆయన అసహనం వెలిబుచ్చారు. అయితే తన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. 

దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ… చేసిన తప్పును అంగీకరించడం గొప్ప విషయమని, అదే మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టిందంటూ సీవీ ఆనంద్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. నరేశ్ అనే వ్యక్తి చేసిన ఆ ట్వీట్ ను సీవీ ఆనంద్ రీట్వీట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

“ఎప్పుడైనా నేను తప్పు చేశానని భావిస్తే నా హోంగార్డుకైనా సరే క్షమాపణ చెప్పేందుకు వెనుకాడను. ఈ గుణం నాలో చిన్నప్పటి నుంచి ఉంది. బహుశా క్రికెట్ ఆడడం వల్ల వచ్చి ఉంటుంది. క్రికెట్ ఆడడం అనేది నన్ను మెరుగైన వ్యక్తిగా మలిచింది. నా అహాన్ని వదిలేయడం ద్వారా నేను అందరిలో ఒకడిగా ఉండాలనుకుంటాను. 

అక్షర న్యూస్ : భూ సమస్యల పై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు.

ఓ వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా మలిచేందుకు జట్టుగా ఆడే క్రీడలు చాలా ముఖ్యమని భావిస్తాను. కానీ కార్పొరేట్ తరహా విద్యా వ్యవస్థలో ఇటువంటి అవకాశం లేకుండా పోవడం దురదృష్టకరం” అని సీవీ ఆనంద్ తన ట్వీట్ లో. పేర్కొన్నారు.