అక్షర న్యూస్ :ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిద్దామని సిద్ధిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పూజల గోపీకృష్ణ అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్ధిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించి పండ్లు, స్వీట్లు పంచి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిద్ధిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పూజల గోపీకృష్ణ మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేనని సేవలు చేసిన ఘనత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కే దక్కింది అని అన్నారు.
దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు నిరుపేదల గుండెల్లో ఇందిరమ్మ పేరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.