అక్షర న్యూస్ :ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సిద్దిపేట వారు తేదీ 22-11-20 24 శుక్రవారం నుండి పతాంజలి యోగా చీప్ పాట్రన్ అయిత అంజయ్య గారి ఆధ్వర్యంలో ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహించబడును. ఇట్టి యోగా తరగతులకు పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ జీవిత సభ్యులు సిద్దిపేట ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతూ నవీన ఆధునిక యుగంలో మనుషులు ఏర్పరచుకున్నటువంటి ఆహారపు అలవాట్ల వల్ల గాని ఇతర అలవాట్ల వల్ల గాని ఎన్నో రోగాల బారిన పడుతున్నారు.
వీటన్నిటికీ యోగ వల్ల బ్లడ్ ప్రెషర్ , చక్కెర మరియు థైరాయిడ్ ఎన్నో రోగాలకు సమస్యలు పరిష్కారం దొరుకుతుందని యోగ వల్ల ఎంతో ప్రశాంతమైన జీవితం పొందవచ్చని ,యోగ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఈ ఉచిత యోగ శిక్షణ తరగతులను అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాము అని వారు తెలియజేసారు.


