• Mon. Mar 17th, 2025

అక్షర న్యూస్ : రేపు, ఎల్లుండి గ్రూప్‌-3 పరీక్షలు..

Bypentam swamy

Nov 16, 2024

అక్షర న్యూస్ :రేపు, ఎల్లుండి గ్రూప్‌-3 పరీక్షలు ,హాజరుకానున్న 5.36 లక్షల అభ్యర్థులు.రాష్ట్ర వ్యాప్తంగా1,401 కేంద్రాలు
Group-3 Exams | హైదరాబాద్‌, నవంబర్16 ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్‌-3 పరీక్షలు ఆది, సోమవారాల్లో జరగనున్నాయి.

పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, 1,401 కేంద్రాలను ఏర్పాటు చేసింది.

అక్షర న్యూస్ : సిద్దిపేట లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు నెరవేరుస్తాడనీ భక్తుల అభిప్రాయం

పరీక్షల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించారు. మొత్తం మూడు పేపర్లు ఉండగా మూడు సెషన్లలో పరీక్ష జరగనున్నది. ఆదివారం ఉదయం జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌, మధ్యాహ్నం హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ, సోమవారం ఉదయం ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ పరీక్షను నిర్వహిస్తారు.

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు వార్డు ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..