• Mon. Mar 17th, 2025

అక్షర న్యూస్ : ములుగు మండలం ఆయిల్ ఫాం నర్సరీని క్షేత్ర స్థాయిలో సందర్శించిన అజిత్ కుమార్ సాహో (ఐఏఎస్)..

Bypentam swamy

Nov 16, 2024

అక్షర న్యూస్ :శనివారం ములుగు మండలం మరియు వర్గల్ మండలంలో కేంద్ర ప్రభుత్వ నూనె గింజల విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ. అజిత్ కుమార్ సాహో (ఐఏఎస్) సందర్శించారు.
ముందుగా జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి కేంద్ర ప్రభుత్వ నూనె గింజల విభాగం సంయుక్త కార్యదర్శి అజిత్ కుమార్ సాహో (ఐఏఎస్) ములుగు అయిల్ ఫామ్ నర్సరీలో మర్యాద పూర్వకంగా మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ములుగు మండలం ఆయిల్ ఫాం నర్సరీని క్షేత్ర స్థాయిలో సందర్శించారు. జిల్లా కలెక్టర్ నర్సరీలో పెంచుతున్న ఆయిల్ ఫామ్ మొక్కల నాణ్యతను అదే విధంగా పాటించవలసిన యాజమాన్య పద్ధతులను గుర్చి తెలిపారు. నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
వర్గల్ మండలం గౌరారం గ్రామం పరిధిలో రాజీవ్ రహదారి పక్కన గల అభిమన్యు కుమార్ రెడ్డి 10 ఎకరాల విస్తీర్ణంలో గల ఆయిల్ ఫాం తోటను క్షేత్ర స్థాయిలో సందర్శించారు.
35 నెలలుగా మొక్కలను పెంచుతున్నట్లు, ఆయిల్ పాం పంటను మరియు డ్రిప్ ద్వారా మొక్కలకు అందించేందుకు విలుగా తవ్వించినా వ్యవసాయ బావిని గుర్చి ఈ మధ్యనే మొదటి సారిగా ఆయిల్ పాం పంటను చేతికి వచ్చిందని అదికారులకు వ్యవసాయ క్షేత్రం చుట్టు చుపిస్తు తోట యజమాని అధికారులకు తెలిపారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు నెరవేరుస్తాడనీ భక్తుల అభిప్రాయం

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు వార్డు ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..