అక్షర న్యూస్ :గ్రూప్-III పరీక్షల సందర్భంగా సిద్దిపేట ఏసీబీ మధు సిద్దిపేట వన్ టౌన్, టూ టౌన్, 3 టౌన్, అధికారులతో కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ గారు మాట్లాడుతూ గ్రూప్-III పరీక్షల సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం సిద్దిపేట వన్ టౌన్ టూ టౌన్ 3 టౌన్ మరియు సిద్దిపేట ఏసీపీతో పటిష్టమైన బందోబస్తు గురించి చర్చించడం జరిగింది.
రూట్ ఆఫీసర్స్ మరియు సెక్షన్ ఆఫీసర్లను సపరేట్గా కేటాయించడం జరుగుతుందన్నారు. పేపర్ ఎస్కార్ట్ గురించి సపరేట్ అధికారులను నియమించడం జరిగింది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా తగు ఏర్పాట్లు జరుగుతుందని తెలిపారు. గ్రూప్-III పరీక్షలు సిద్దిపేట పట్టణంలో 37 కేంద్రాలలో తేదీ: 17-11-2024 మరియు 18-11-2024 రెండు రోజులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బంధువుబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ గ్రూప్-III నోడల్ అధికారి, సిద్దిపేట ఏసీపీ మధు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.