అక్షర న్యూస్ :పోలీస్ అధికారులకు సిబ్బందికి మెడికల్ టెస్ట్లు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈరోజు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లచే కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.విధి నిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యం.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి సహాయ సహకారాలతో సిద్దిపేట ప్రభుత్వ డాక్టర్లచే సిద్దిపేట జిల్లా పోలీస్ సిబ్బందికి అధికారులకు గత 15 రోజుల నుండి వార్షిక ఆరోగ్య పరీక్షలు సిబ్బంది అధికారులు నిర్వహించడం జరిగింది. 54 రకాల టెస్ట్ రిపోర్ట్ ల ప్రకారం ఈరోజు మొదట మొదటి విడతగా 50 మంది అధికారులకు సిబ్బందికి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ ద్వారా డాక్టర్లచే కౌన్సిలింగ్ నిర్వహించి అవసరమైన వారికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రక్రియ 15 రోజుల వరకు కొనసాగుతుంది.
ఆరోగ్య పరిరక్షణ గురించి సిబ్బంది పాటుపడాలని మంచి ఆహారం తీసుకోవాలని పోలీస్ అధికారులకు సిబ్బందికి సూచించారు. వత్తిడి లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి స్వాత్విక ఆహారం భుజించడం ఉత్తమం మనం తీసుకునే ఆహారంలో పాలు పండ్లు తప్పకుండా ఉండాలి.
ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజు యోగా స్విమ్మింగ్ వాకింగ్ రన్నింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలని సూచించారు. అధికారుల ది సిబ్బందిది జిల్లా మొత్తంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుంది. తీవ్రమైన వ్యాధుల బారిన పడే వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ విమల థామస్, సూపరిండెంట్ డాక్టర్ శాంతి, ఆర్ఎంఓ జ్యోతి, డాక్టర్లు కాంత శ్రీ, డాక్టర్ గీత, డాక్టర్ చేతన్ రాహుల్, డాక్టర్ శ్యామ్, డాక్టర్ దశమ్ స్పము, డాక్టర్ ప్రియ, డాక్టర్ నాగార్జున, డాక్టర్ హరికృష్ణ మరియు మెడికల్ సిబ్బంది, ఆర్ఎస్ఐ వెంకటరమణ, పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![](https://aksharanews.com/wp-content/uploads/2024/11/1000344381-1024x682.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/11/1000344384-1024x682.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/11/1000344383-1024x682.jpg)