• Mon. Feb 3rd, 2025

అక్షర న్యూస్ : పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Bypentam swamy

Nov 12, 2024

అక్షర న్యూస్ :పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులోని రంగంపల్లివద్ద మంగళవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది,

ఓ కారు వేగంగా వచ్చి, అదుపుతప్పి.. నడుచు కుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది,ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ పెద్దపల్లి లోని ఉదయనగర్‌కు చెందిన అమృత, భాగ్య అని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..