అక్షర న్యూస్ :దేశంలో ఉల్లిధరలు రోజురోజు కు ఘాటెక్కుతున్నాయి. నిన్న, మొన్నటివరకు కిలో రూ. 40 వరకు ఉన్న ఉల్లిధరలు ఇప్పుడు రెట్టింప య్యాయి.ఇక ముంబై, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర ఏకంగా రూ.100 పలుకుతోందని సమాచారం. ఇక హోల్ సేల్ మార్కెట్ లో కిలో ఉల్లి ప్రస్తుతం రూ. 40 నుంచి 60 పలుకుతుండగా..
తాజా అది రూ.70 నుంచి 80 రూపాయలకు పెరిగింది. మరికొద్ది రోజుల్లో హోల్ సేల్ మార్కెట్ లోనే కిలో ఉల్లి రూ. 100 చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. దీంతో ఉల్లి కొనాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. వంటింట్లో ఉల్లిలేనిదే ఏ వంట పూర్తికాదు. అయితే ఉల్లి ధరలు పెరుగుదలకు ద్రవ్యోల్బణం ప్రభావం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు.


